ఎక్కడో లోపం వుంది- ఈ వ్యవస్థలో అంతర్లీనంగా ! దొరకట్లేదది. ఎందుకో అర్ధకాని నిర్లిప్తత చోటు చేసుకుంది. ఒక్కటే కారణం- నిజం దొరకక పోవటం లేదా దాచబడటం.మనస్సు గుర్తిస్తోందీవిషయాన్ని .కానీ హృదయం అంగీకరించట్లేదు - రెండిటి మద్యా సమన్వయం లేక! బాహ్య ప్రపంచ విషయాల్ని సరైన విధంగా మనస్సు గుర్తించినా హృదయ విశ్లేషణ సరిగ్గా లేదో, మనస్సు తప్పుగా గుర్తించడం వల్ల హృదయం అదే విధంగా విశ్లేషిస్తోందో లేక తప్పుగా గుర్తించినదాన్ని సరిగ్గా మార్చడానికి మధన పడుతోందో అర్ధంగాని పరిస్థితి.
అల్లకల్లోలంగా వుందంతా! ఒక్కటి కావాలి- నిజం- ప్రశాంతత- స్థైర్యం- ధైర్యం- బలం. ఒక్క క్షణంలో వచ్చేస్తాయవన్నీ- కానీ రాలేవు. గట్టిగా అడగాలనీ అన్పిస్తుంది,అరవాలనీ అన్పిస్తుంది. బహుశః మానసిక దౌర్బల్యమేమో!ఈ మధనమంతా తెలిసి జరిగేది. తెలియకుండా జరిగితే ఆఖరి ఫలితం ఊహకు రాదు కాబట్టి చింతే లేదు. కానీ ఫలితం తెలుసు -కాని ముందు పరిణామాలు తెలియవు. ఆ పరిణామాలన్నీ నేనే కారణమని ఒక గొప్ప భావన నాలో ! పైగా వాటిని నాకనుగుణంగా మర్చేస్తానేమో అని గట్టి నమ్మకం. గుడ్డిగా.
ఒక గట్టి నమ్మకం ఉంది నాకు. ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరేలాగా! కానీ మధ్యలోని స్థానభ్రంశం - నాకు కాదు మనసుకి, హృదయాకిని- మింగుడు పడని విషయం. ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. కాదని ఎవరన్నారు? కానీ క్షోభననుభవించడం చాలాకష్టం. వేలాది ఆలోచనల తుఫానులో పడి ఎక్కడికో కొట్టుకు పోతుంటే దారి తెన్నూ తెలియక సహాయం కోసం ఎవరిని అడగాలో తెలుసు. తర్వాత ఫలితమూ తెలుసు . ఏమీ కాదనీ తెలుసు . కాదు - తెలియచెప్పబడుతుంది. కారణం ఒక్కటే- పూర్తి విశ్వాశం!
కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసుంటాను- ఒప్పుకుంటున్నాను. అహంకారం. కానీ స్వార్ధంకోసం అయి ఉండొచ్చు! సామాజికమయి ఉండవచ్చు! ఫలితం? తెలియలేదింత వరకూ. సమయం కోసం వేచిచూడాలి. ఒక్క ఘడియ చాలు- చాలా ప్రశాంతతని నింపడానికి. కానీ ఆ ఒక్క ఘడియ తీరిక దొరకడం లేదు. ***
తాత్కాలిక ఆనందాన్ని కలిగించే అబద్దం కన్నా, తాత్కాలికంగా బాధ కలిగించినా చివరికి జీవితంలోఒక ప్రశాంతతనిచ్చే 'నిజం' కావాలి. వెతికి సాధించాలి.ఒక్క చోట దొరకక పోవచ్చు. ఎన్ని చోట్లైనా వెదకాలి. సమాజాన్నిచూస్తే కోపం వేస్తుంది. నన్ను చూస్తే కూడా! రెండు సమాజాల్ని చూసినట్లుంటుంది- పరస్పర విరుద్ధంగా ! ఏమాత్రంపొసగ కుండా! ఎక్కడా లేని భావాలో, అన్ని చోట్లా వున్న భావాలో- అన్నీ నా సమాజం లో వున్నాయి. ఆవేదన, ఆలోచన, ఆవేశం, అనుమానం, ఆశయం, కోపం, ద్వేషం, సంతోషం, బాధ అన్నీ! కానీ స్వార్ధం కోసం కాదేమో! కాకపోతేనేబాగుంటుంది. బయటి సమాజంలోనూ ఇవి వున్నాయి - పరస్పర విరుద్ధంగా!
సమాధానం లేని ప్రశ్నలివన్నీ. ఎందుకు పుడతాయో తెలియదు. మనస్సు గందరగోళ పరచడానికి. ప్రశ్నకో అర్ధం ఉండాలి. ఆ ప్రశ్నలోంచి మరోప్రశ్న ఉదయిస్తే అర్ధవంతంగా సమాధాన పరచగలగాలి- రెంటినీ! అసలుసమాధానం ఏ ప్రశ్నకైనా ఉంటుందా అనేది ప్రశ్న? సరైన సమాధానం ఉండకపోవచ్చు. కానీ సమాధాన పరిచేతాత్కాలిక సమాధానం ఉండవచ్చు. అదైనా ప్రస్తుతానికి ఆమోదయోగ్యమే. తాత్కాలికంగానైనా హృదయాన్ని సంతృప్తిపరచడానికి. చివరాఖరికి అనుభవం ద్వారా తెలుస్తుంది సమాధానం- ఈ ప్రశ్నలన్నిటికీ! నవ్వొస్తుందప్పుడుసమాధానం ఇంత చిన్నదా" అని! అదే అనుభవమంటే! దాన్ని సంపాదించడానికి పాట్లు పడాలి. లేకపోతే వృధాఅయిపోతుంది జీవితమంతా! అసలు గొడవంతా ప్రశ్నది. ఈ ప్రశ్నకి సమాధానం లేక కదా! అన్నట్లు ప్రశ్నే లేకపోతే? చాలారకాలున్నాయి: ఆలోచించేవి- ఆలోచింపచేసేవి, అనుమానించేవి- అనుభవాన్నిచ్చేవి, అర్ధం కానివి- అర్ధం లేనివిఎన్నో . అన్నిటికీ ఒకటే సమాధానం - "కాలం". ఎన్నో స్మృతుల్ని తనలో దాచుకుని ఏమాత్రం వెనక్కి చూడకుండా కదిలేఏకదిశా ప్రయాణం- కాలంతోపాటు సాగడమంటే! పురోగమనమే తప్ప తిరోగమనం లేదు. అలుపూ అలసటా అసలే లేవు. సినారె చెప్పినట్లు " ఉదారమైన కాలం ముందుకు సాగుతూ వున్నా- కొన్ని మొండి క్షణాలు కదలనంటున్నాయి". నేను రాసుకున్నాను -" ఆ మొండి క్షణాల్ని బహుశః కాలం కూడా ఆగి విస్మయగా చూస్తుందని. కాలానికేం పని? మనల్ని పట్టించుకోవడానికి.పిచ్చివాడిని.
అన్నీ ఆ కాల గర్భంలోనే కలసి పోతుంటాయి. శిధిలమౌతాయి. కొన్ని సజీవంగా, కొన్ని నిర్జీవంగా! కనీసం కొన్ని క్షణాల ముందైనా తెలియదా నిర్జీవ శవాలకి సజీవంగా మారొచ్చని? కానీ అదే నయం. సజీవాలైతేబాధపెడుతుంటాయి - కళ్ళముందు కదలాడుతూ. డైరీల్లో రాసే పుటల్ని తిప్పి చదవకూడదు-అప్పుడే అవి నిర్జీవంగామారతాయి. వెర్రివాళ్ళు చేసే పని.
స్వేచ్చగా కదలిపోయే ఆలోచనలకి సంకెళ్ళు వేద్దామని ప్రయత్నిస్తే- ఆనకట్ట కట్టడానికి ప్రయత్నిస్తే , ప్రవాహం ఆగనివ్వడంలేదు. బహుశః తుఫాను కాలం కావొచ్చు. వరదలొచ్చి ఉండొచ్చు. సందిగ్ధా వస్థలో మనస్సు చేసేపనిది. దానిపని అది చేసుకోక హృదయాన్ని కల్లోల పరుస్తూంటుంది. అవును నిజమే మా మనస్సు- మా హృదయంపరస్పరం శత్రువులు. ఎంతకాలం ?
"